![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -509 లో...ప్లాన్ సక్సెస్ అయిందని శ్రీవల్లి, సుకన్య మెరుపు తీగ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. మరొకవైపు సాగర్ ని తన ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు. డబ్బులు లేవని సాగర్ చెప్తాడు. అప్పుడే ప్రసాదరావు వచ్చి సాగర్ ని పక్కకి తీసుకొని వెళ్లి వచ్చే జీతంతో బ్రతకలేవని ఒక ఫైల్ పై సంతకం పెట్టించి.. పదివేలు సాగర్ కి లంచం ఇప్పిస్తాడు. సాగర్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి పార్టీ ఇస్తానని అంటాడు.మరొకవైపు వల్లి వదిన మీకు సపోర్ట్ గా మాట్లాడడం ఏంటి వదిన అని ధీరజ్ అంటాడు. అదే నాకు అర్థం కావడం లేదని నర్మద అంటుంది.
మాములుగా అయితే చిన్న విషయానికే పెద్ద గొడవ చేస్తుంది. అలాంటిది మీ వల్ల అబార్షన్ అయితే ఇలా మాట్లాడుతుందా.. ఇందులో ఏదో ఉందని ధీరజ్ అంటాడు. ఆక్సిడెంట్ చేసింది ఒక అమ్మాయి మొహానికి కర్చీఫ్ కళ్ళకు అద్దాలు పెట్టుకుందని నర్మద అనగానే మొహం కన్పించకుండా కవర్ చేసిందంటే ఎవరో కావాలనే చేశారని ధీరజ్ అంటాడు. అవును ఎవరో కనుక్కోవాలని ప్రేమ అంటుంది. అదంతా విన్న సుకన్య వెళ్లి వల్లికి చెప్తుంది. నువ్వేం కంగారుపడకు వాళ్లని డైవర్ట్ చేస్తానని అమ్మ కడుపునొప్పి అంటూ యాక్టింగ్ మొదలుపెడుతుంది.వేదవతి, అమూల్య, చందు వస్తారు. ప్రేమ నర్మద ధీరజ్ కూడా వస్తారు. బా అంటూ చందుని హగ్ చేసుకొని వల్లి ఏడుస్తుంది. ఇప్పటివరకు బానే ఉన్నావ్ కదా అని ప్రేమ అంటుంది. అసలు నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడం ఏంటి.. అసలు నీకు కడుపు ఉందా అని నర్మద అనగానే వేదవతి తన చెంపచెల్లుమనిపిస్తుంది.
అసలు నీకు బుద్ది ఉందా.. తన బాధలో తను ఉంటే అలా మాట్లాడుతావా. .తల్లి కాబోయే విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా.. అమూల్య విషయంలో ఇంకా వాళ్ళ అమ్మనాన్న మాటలు విని చేసిన మోసాలకి నేను ఎప్పటికి క్షమించను కానీ ఇలా బాధపడుతున్నప్పుడు అలాగేనా మాట్లాడేదని నర్మదపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత మన ప్లాన్ ఎలా ఉందని సుకన్యతో వల్లి అంటుంది. మరొకవైపు మిల్ నుంచి రెండు లక్షలు దొంగతనం చెయ్ అని ఆనందరావుతో భాగ్యం అంటుంది. నాకు భయంగా ఉందే నేను చెయ్యలేనని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |